Advertisement
Google Ads BL

బ్రతికిపోయా అంటున్న రష్మిక


ప్రస్తుతం రష్మిక మందన్న క్రేజ్ సౌత్ నుంచి నార్త్ దాకా పాకిపోయింది. యానిమల్ సూపర్ హిట్ అవడం, పుష్ప ప్యాన్ ఇండియా హిట్ అవడంతో నేషనల్ క్రష్ క్రేజ్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్, బాలీవుడ్, తమిళం ఇలా ఏ భాషలో చూసినా రష్మిక పేరే వినిపిస్తోంది. తెలుగులో పుష్ప 2 షూటింగ్ తో పాటుగా.. రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ లాంటి బైలింగువల్ మూవీస్ లో నటిస్తుంది. ప్రతి రోజు బిజీ బిజీగా గడిపేస్తున్న రష్మిక తాజాగా తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ముంబైలో ఉన్న రష్మిక శనివారం ఉదయం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వెళ్లాల్సి రావడంతో ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కింది. అదే ఫ్లైట్ లో మరో హీరోయిన్ శ్రద్ద దాస్ కూడా ప్రయాణం చేసింది. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 నిమిషాలకే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఫ్లైట్ తిరిగి ముంబైలోనే ఎమర్జెన్సీ లాండింగ్ చేశారట. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అవ్వకపోయినప్పటికీ ఫ్లైట్ లో ఉన్న ప్రకణికులందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా రష్మిక ట్వీట్ చూస్తే తెలుస్తోంది. 

రష్మిక సోషల్ మీడియా వేదికగా ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నామంటూ శ్రద్ద దాస్ తో కలిసి దిగిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానితో రష్మిక అభిమానులు ఊపిరి తీసుకుంటున్నారు.

Rashmika flight makes emergency landing:

Rashmika Details Her Near-Death Experience
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs