రకుల్ ప్రీత్ మరో వారంలో తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలెక్కబోతుంది. ఫిబ్రవరి 21 న గోవా వేదికగా రకుల్ తాను ఇష్టపడిన జాకీ భగ్నానీతో ఏడడుగులు నడవబోతుంది. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీలు ఫైనల్ గా పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. గోవా వేదికగా రకుల్ ప్రీత్ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి. గోవాలోని వీరి మధ్యన ప్రేమ చిగురించడంతో రకుల్ ప్రీత్ అక్కడే తన పెళ్లిని చేసుకోవాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొచ్చాయి.
ప్రస్తుతం గోవాకి వెళ్ళబోతున్న రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీలు ముంబై సిద్ది వినాయక టెంపుల్ ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించుకున్న పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీ సిద్ది వినాయకుడి దర్శించుకుని.. పూజలు నిర్వహించారు. మరి పెళ్ళికి ముందు ఎటువంటి అవిజ్ఞాలు ఎదురవకుండా రకుల్ జంట ఇలా పవర్ ఫుల్ గాడ్ సిద్ది వినాయకుడికి పూజలు చేసి బ్లెస్సింగ్ తీసుకుని మరీ గోవాకి బయలుదేరుతున్నారు. గోవాలో ఈ నెల 21 న వివాహం.. అంతకు రెండు రోజులు ముందు మెహిందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ ని నిర్వహించనున్నారు.
రకుల్ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులతో పాటుగా ఆమె స్నేహితులు, జాకీ భగ్నానీ కుటుంబ సభ్యులు అలాగే రకుల్ ప్రీత్ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే హాజరు కానున్నారు.