Advertisement
Google Ads BL

BJP కోసం ఈ త్యాగాలు అవసరమా?


ఏపీ ఎన్నికలలో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా పూర్తైంది. ఆ తరువాత బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో పొత్తుకు సిద్ధమైంది. అప్పటి నుంచే జనంలో ఏదో తేడా కొడుతోంది. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీతో పొత్తుకు మొగ్గు చూపడానికి కనిపిస్తున్న కారణం ఒక్కటే. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా కూడా ఏపీ సీఎం జగన్ తన అధికారాన్ని వినియోగిస్తే కష్టమని భావిస్తున్నారు. టీడీపీ అభిమానులను ఓట్లేయకుండా ఫ్రీజ్ చేయగలిగితే చాలు కదా.. వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. కాబట్టి వైసీపీ అధికార బలానికి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ సాయం తప్పనిసరి అని చంద్రబాబు భావించినట్టున్నారు. 

Advertisement
CJ Advs

ఉభయ గోదావరి జిల్లాల్లో 6 సీట్లు కావాలట..

అయితే అదొక్కటి చూసుకుంటే.. టీడీపీ చాలా విధాలుగా నష్టపోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు పోయాయి. ఇక ఇప్పుడు మిగిలిన సీట్లలో కొన్ని బీజేపీకి ఇస్తే తప్ప అది శాంతించేలా లేదని ప్రచారం జరుగుతోంది. జిల్లాల వారీగా ప్రతి జిల్లాలోనూ ఒకటి నుంచి 6 అసెంబ్లీ స్థానాలు కోరుతోందని టాక్. మొత్తంగా చూస్తే 20 సీట్లకు తక్కువ కాకుండా తీసుకోవాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 6 సీట్లు తీసుకోవాలని బీజేపీ అధిష్టానానికి నేతలు సూచిస్తున్నారట. పైగా ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా పోటీ చేసినా కూడా మనం దాదాపు 20 స్థానాలు కైవసం చేసుకుంటామని చెబుతున్నారట. 

వైసీపీకి పరోక్షంగా సహకరించడమే..

అందుకే 20 సీట్లు తీసుకోవాలని బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర నేతలు సూచిస్తున్నారట. ఈ నెల 20న చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తినకు పయనం కానున్నారు. అప్పుడు పొత్తులు, సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ అడిగినన్ని స్థానాలనూ ఇవ్వాలంటే ఇరు పార్టీలు త్యాగం చేయక తప్పదు. అలా త్యాగం చేశారో అసలుకే ఎసరు వస్తుంది. టీడీపీ నేతల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. మొత్తంగా బీజేపీతో పొత్తు అంటే వైసీపీకి పరోక్షంగా సహకరించడమేనని టీడీపీ కేడర్ అంటోంది. నిజానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడే సక్సెస్‌కు చేరువయ్యారు. ఇప్పుడు బీజేపీతో జత కట్టి సక్సెస్‌ను దూరం చేసుకోవడమేనని టీడీపీ నేతలు కొందరు మదనపడుతున్నారు. ఎలా చూసుకున్నా వైసీపీ గెలిచే అవకాశమే లేనప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని దాని కోసం త్యాగాలు చేయడమేంటని అంటున్నారు. ఒకసారి టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచించాలి.

Is tdp and Janasena Sacrifice for BJP:

BJP Wants 6 Assembly Seats in Every District
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs