Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ దేవర కొత్త రిలీజ్ డేట్


ముందు నుంచి ఏప్రిల్ 5 విడుదల అంటూ బలంగా చెబుతూ ఫాన్స్ ని ఎగ్జైట్ చేస్తూ వచ్చిన దేవర మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించి అభిమానులని కాస్త డిస్పాయింట్ చేసారు. గత నెల రోజులుగా దేవర డేట్ మారొచ్చనే ఊహాగానాలను నిజం చేస్తూ అఫీషియల్ గా దేవర ని ఏప్రిల్ 5 నుంచి షిఫ్ట్ చేస్తూ కొత్త డేట్ ని అనౌన్స్ చేసారు. 10-10-24 న అంటే అక్టోబర్ 10 న దేవర పార్ట్ 1 విడుదల చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేసి కొత్త పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర లో ఎన్టీఆర్ కేరెక్టర్ పై ఇప్పుడు వదిలిన పోస్టర్ మరింతగా అంచనాలు పెంచింది. ప్యాన్ ఇండియా లెవల్లో దేవర పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ నుంచి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని, హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకొచ్చి కొరటాల ముందు నుంచి ఈ చిత్రంపై ప్యాన్ ఇండియా ప్రేక్షకుల అటెన్షన్ ఉండేలా చూసుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ గాయం వలనే దేవర చిత్రాన్ని అనుకున్న తేదికి రీలీజ్ చేయలేకపోవడంతో ఇప్పుడు కొత్త తేదీని అనౌన్స్ చేసారు. మరి పుష్ప 2 ఆగష్టు 15 న రిలీజ్ అవుతుంటే దేవర కూడా అదే డేట్ లాక్ చేస్తున్నారంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి.

కానీ అటు అల్లు అర్జున్ పుష్ప 2 కి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్టోబర్ లో డేట్ ఇవ్వడంతో మిగతా చిత్రాల రిలీజ్ విషయంలో మిగతా మేకర్స్ రిలాక్స్ అవుతున్నారు.

NTR Devara new release date:

NTR Devara to unleash his power on this date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs