Advertisement
Google Ads BL

చంద్రబాబు 2.0.. కుర్చీని మడతపెట్టి..


ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత సక్సెస్‌ను తెచ్చిపెట్టిందో తెలియదు కానీ ఈ సినిమాలో సాంగ్ మాత్రం సినిమాకు బీభత్సమైన సక్సెస్‌ను తెచ్చి పెట్టింది. కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ వస్తే చాలు.. విజిల్సే విజిల్స్. థియేటర్లు హోరెత్తాయి. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా డీజేల్లో ఈ సాంగే మారుమోగుతోంది. ఈ డైలాగ్‌ను తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు వాడారు. అది విన్న ఏపీ ప్రజానీకం.. ఆయన చంద్రబాబు కాదు.. చంద్రబాబు 2.0 అంటున్నారు. ఏపీ సీఎం జగన్ కామెంట్‌కు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రేంజ్‌లో సమాధానం ఇచ్చారు. ఇక అంతే సభ మొత్తం ఈలలు, కేకలతో హోరెత్తింది. చంద్రబాబేంటి మాస్ డైలాగ్ వాడమేంటని అంతా అవాక్కయ్యారు. 

Advertisement
CJ Advs

మడత బెట్టి వస్తే మేము ఊరుకుంటామా?

వలంటీర్లకు వందనం సభలో ఏపీ సీఎం జగన్ ఒక మాస్ డైలాగ్ వాడారు. ఎన్నికలకు చొక్కా చేతులు మడత బెట్టి రంగంలోకి దిగాలని ఆయన వైసీపీ కేడర్‌ని కోరారు. దీనికి కౌంటర్‌గా విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో జగన్‌ చొక్కా మడతపెట్టి డైలాగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అంతకు మించి కౌంటర్ ఇచ్చారు. మీరు చొక్కా చేతులు మడత బెట్టి వస్తే మేము ఊరుకుంటామా? టీడీపీ, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడత పెట్టి వస్తారు. అప్పుడు జగన్ కూర్చున్న సీఎం కుర్చీయే గల్లంతు అవుతుందని పక్కా మాస్ టోన్‌తో చెప్పారు. ఇక అంతే అక్కడున్న టీడీపీ కేడర్, జనసేన కేడర్‌లో రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది. పెద్ద ఎత్తున కేకలతో హోరెత్తించారు. ఈ ఏజ్‌లో చంద్రబాబు మాస్ డైలాగ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మాస్ వార్నింగ్ ఇచ్చేశారు..

నిజానికి బాబు చాలా సౌమ్యంగానే మాట్లాడుతుంటారు. కానీ ఈసారి మాత్రం తనలోని న్యూ షేడ్‌ను అయితే పరిచయం చేశారు. వాస్తవానికి రాజకీయాల్లో కావాల్సింది కూడా ఇదే. జనాల్లో ఉత్సాహం రావాలంటే ఈ రోజుల్లో మాస్ డైలాగ్స్ తప్పనిసరి. మొత్తానికి చంద్రబాబు అయితే అప్‌డేట్ అయిపోయారు. యూత్‌కి సైతం కనెక్ట్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికలు అంటే యుద్ధం కాదు గుర్తు పెట్టుకోమంటూ జగన్‌కు ఇప్పటికే మాస్ వార్నింగ్ ఒకటి ఇచ్చేశారు. మీరు హూందాగా ఉంటేనే.. మేము కూడా హూందాగా ఉంటామని చెప్పేశారు. మొత్తానికి అటు జగన్‌కు వార్నింగ్, కౌంటర్స్ ఇస్తూనే ఇటు యూత్‌కి సైతం కనెక్ట్ అయ్యేందుకు చంద్రబాబు యత్నించి సక్సెస్ అవుతున్నారు. జగన్ అయితే చంద్రబాబు నోటి వెంట కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఊహించి ఉండరు.

Chandrababu Kurchi Madathapetti Dialogue Creates Sensation:

Mass Warning To YS Jagan From Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs