హీరో విశ్వక్ సేన్ ఏ విషయమైనా డైరెక్ట్ గా మట్లాడుతూ కాంట్రవర్సీలకి కేరాఫ్ గా నిలుస్తాడు. మీడియా ముందు కాస్త ఎక్కవగా మట్లాడుతూ అందరి అటెన్షన్ తనవైపే ఉండేలా చూసుకోవడంలో విశ్వక్ సేన్ కి ఎవరూ సాటిరారు. గత ఏడాది బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ విశ్వక్ సేన్ విషయంలో ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం గామి అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ ఇకపై ఎలాంటి విషయాలు మాట్లాడను, సైలెంట్ గా ఉండడమే బెటర్ అనుకుంటున్నాను అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
తానెక్కడికి వెళ్లినా అందరూ అచ్చం హీరోలా ఉన్నావ్ అనేవారు, అది చూసి నేను కూడా సిరీస్ గా తీసుకుని హీరో అవుదామని రెడీ అయ్యి దిల్ రాజు గారి జోష్ ఆడిషన్స్ కి వెళ్ళా, అది వర్కౌట్ అవ్వలేదు, అవకాశాల కోసం చాలా సినిమాల ఆఫీస్ ల గేట్స్ కూడా దాటలేకపోయాను. అది చెప్పి సింపతీ వర్కౌట్ చేసుకోవాలనుకోవడం లేదు. అది నాకు నచ్చదు. ఒక డైరెక్టర్ నా గురించి మీడియా ముందు కంప్లైంట్ చేసాడు. అతను మా ఇంటికి కూడా వచ్చాడు. ఇంకా చాలా జరిగింది. అది ఎవరికీ తెలియని విషయం.
అయినా ఏం జరిగినా ఇకపై రియాక్ట్ అవ్వొద్దని డిసైడ్ అయ్యాను. అదే బెటర్ అనిపిస్తుంది. చాలామంది నిర్మాతల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ.. నేను పారితోషకం కోసం సినిమాలు చేసే టైప్ కాదు. ఈ మధ్యనే రామ్ చరణ్ ని కలిసాను. కానీ ఏం మాట్లాడానో అనేది అడగొద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న వేస్తె ఏ నటుడు సమాధానం చెప్పడు అంటూ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ చూసిన నెటిజెన్స్ అబ్బ విశ్వక్ నువ్ సూపర్ డెసిషన్ తీసుకున్నావ్ అంటూ మాట్లాడుకుంటున్నారు.