Advertisement
Google Ads BL

నెంబర్ 1 ప్లేస్ లో రష్మిక


ప్రస్తుతం శ్రీవల్లి టైమ్ నడుస్తుంది. పుష్ప చిత్రంతోనే నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన ఈ నేషనల్ క్రష్ రష్మిక యానిమల్ చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్ లో సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక మందన్న కి హిందీలో వరసగా షాకులే తగిలాయి. కానీ యానిమల్ హిట్ తో ఒక్కసారిగా ఆమె జోరు మొదలైంది. ఇటూ పుష్ప 2 లాంటి భారీ ప్రాజెక్ట్, అటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు, హిందీ ప్రాజెక్ట్స్, తమిళనాట భారీ మల్టీస్టారర్ అయిన ధనుష్ చిత్రంలో రష్మిక అవకాశం దక్కించుకుంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం రష్మికలా ఏ హీరోయిన్ కూడా ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ చెయ్యడం లేదు. అదే ఊపులో రష్మిక తాజాగా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించి మరో స్థాయికి చేరింది. ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసులోపు ఉన్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాల రష్మిక మందన్న నెంబర్ 1 ప్లేస్ లో నిలవడం విశేషం. సోషల్ మీడియా వేదికగా రష్మిక మందన్న ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. 

ఈ సందర్భంగా యంగ్ టాలెంట్స్ తో కలిసి కవర్ పేజీ పై స్టిల్ ఇచ్చిన తన ఫోటోని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది, అంతే కాదు.. తనను ఆదరించిన ప్రేక్షకుల అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

Rashmika in number 1 place:

Rashmika skyrockets into Forbes India 30 Under 30 Class of 2024
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs