Advertisement
Google Ads BL

ఇన్నాళ్లు గుడ్డి గుర్రం పళ్లు తోమారా?


ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా వైసీపీకి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని అన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అవుతుంటే.. ఇంకా హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రం పళ్లు తోమారా? అని షర్మిళ ఫైరయింది. ట్విట్టర్ వేదికగా వైసీపీ ఉమ్మడి రాజధాని కుట్రపై షర్మిళ మండిపడింది. ఆమె ట్వీట్‌లో

Advertisement
CJ Advs

ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే... ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలే. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీలు లేవు. పోలవరం పూర్తి కాలేదు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు. కొత్త పరిశ్రమలు లేవు. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్ర ప్రదేశ్ చేశారే తప్పా... అభివృద్ధి చూపలేదు. మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు.

ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే... మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా వైసీపీకి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని పేర్కొంది.

YS Sharmila Tweet on YSRCP Common Capital Comments :

YS Sharmila Fires on YSRCP Common Capital Conspiracy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs