Advertisement
Google Ads BL

షారుక్ డంకీ.. ఓటీటీలోకి వచ్చేసింది


బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రభాస్ సలార్ చిత్రానికి పోటీగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రాన్ని.. తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్‌కు రెడీ చేసింది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన సలార్ ఎప్పుడో ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

షారుక్ ఖాన్‌తో పాటు ఇందులో తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ వంటివారు కీలక పాత్రలలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. విడుదలైన రెండు మూడు రోజులు కాస్త నెగిటివ్ టాక్‌కి గురైనా.. ఆ తర్వాత బాగానే పుంజుకుని.. మంచి విజయాన్ని అందుకుంది. అయితే అంతకు ముందు వచ్చిన షారుక్ జవాన్ అంత సెన్సేషన్‌ని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పంజాబ్‌లోని ఓ పల్లెటూరులో తాప్సీ, విక్కీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్.. వేరు వేరు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇంగ్లాండ్ వెళ్లడమే. కానీ వారి దగ్గర అందుకు సరిపడా డబ్బులు కానీ, అలాగే వీసాలు కానీ ఉండవు. ఆ సమయంలో ఆ ఊరికి వచ్చిన జవాన్ హర్డీ సింగ్ (షారుక్).. వారికి సాయం చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో.. అక్రమ మార్గంలో ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్న వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు వారికి ఉన్న సమస్యలు ఏంటి? దేశ సరిహద్దు దాటిన వారు మళ్లీ ఇండియాకు వచ్చారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. 

Shahrukh Dunki Streaming Now:

Shah Rukh Khan Dunki Streaming Now On Netflix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs