Advertisement
Google Ads BL

ఒక్కరోజు కాదు.. హ్యాపీ ఎవ్రీ డే


వాలెంటైన్స్ డే‌ని పురస్కరించుకుని సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన బ్యాచ్‌లర్. ఇంకా ఎవరూ లవర్ లేరని ఆ మధ్య చెప్పాడు. మరి వాలెంటైన్స్‌ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు. అందుకేనేమో.. వాలెంటైన్స్ డే ఒక్క రోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ పండగలానే ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా సాయి ధరమ్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సింగిల్ కింగ్‌లందరూ.. ఏం చెప్పావన్నా.. అంటూ ఒకటే కామెంట్స్. 

Advertisement
CJ Advs

ఇవాళ వాలెంటైన్స్‌ డే అట.. మరి రేపేంటి? అందుకే ప్రతిరోజూ స్పెషల్‌గా ఉండేలా చూసుకోవాలి.. లేదంటే మిమ్మల్ని ప్రేమించే, అభిమానించే వారితో స్పెషల్‌గా మలుచుకోండి. స్మైల్‌.. హ్యాపీ ఎవ్రీ డే అంటూ.. హాయిగా నవ్వుతూ ఉన్న ఓ ఫొటోని షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. నిజమే మరి.. వాలెంటైన్స్ డే ఒక్కరోజే ప్రేమ చూపించాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే తేజ్ ఇలా చెప్పుకొచ్చాడన్నమాట. అందులోనూ ఆయన ప్రతిరోజూ పండగే అనే సినిమా కూడా చేసి ఉన్నాడు కదా.. అందుకే ఇలా చెప్పి ఉండవచ్చు. 

ఇక సాయి ధరమ్ చేసిన ఈ ట్వీట్‌కు కామెంట్ల వర్షం కురుస్తోంది. సోలో బతుకే సో బెటర్ అంటారా అయితే.., సో ట్రూ.., ఒక సింగిల్‌ గాడి కష్టం సాటి సింగిల్ గాడికే తెలుస్తుంది అన్న అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో వాలెంటైన్స్ డే వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ ట్వీట్ వైరల్ అవుతూనే ఉంది. సాయిధరమ్ తేజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే చిత్రం చేస్తున్నారు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

Sai Dharam Tej Valentines Day Tweet Goes Viral:

Happy Every Day Says Sai Dharam Tej
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs