Advertisement
Google Ads BL

Tillu Square: వీక్ స్పాట్‌ పట్టేశారు


2022లో వచ్చిన డీజే టిల్లు సినిమా సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అందులోని టైటిల్ సాంగ్, హీరో డైలాగ్స్, రాధిక.. ఇప్పుడప్పుడే మైండ్ నుండి పోనే పోవు. మరింతగా గుర్తు చేసేలా.. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ వచ్చేస్తోంది. ఇందులో రాధిక లేదు కానీ.. అంతకు మించి అనేలా అనుపమ రచ్చ రచ్చ చేస్తోంది. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి అని అనిపించుకున్న అనుపమ.. టిల్లు స్క్వేర్‌లో మాత్రం నాతోని కూడా అట్లుంటది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ వైరల్ అవడమే కాకుండా.. అనుపమ గురించి మాట్లాడుకునేలా చేశాయి. తాజాగా మేకర్స్ వాలెంటైన్స్‌ డేని పురస్కరించుకుని థియేట్రికల్ ట్రైలర్ వదిలారు.

Advertisement
CJ Advs

ఇందులో అనుపమ, సిద్ధుల మధ్య రొమాన్స్, రొమాంటిక్ సీన్స్.. అబ్బో డోస్ మాములుగా లేదు. ముఖ్యంగా అనుపమేనా ఇలా లిప్‌లాక్‌లు దంచేస్తోంది అని ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం ఖాయం. టిల్లుగా సిద్ధు మొదటి పార్ట్‌‌ని కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉంటే.. ఈ స్క్వేర్‌కి మాత్రం అదిరిపోయే ఇమేజ్‌ని, క్రేజ్‌ని తీసుకొస్తుంది మాత్రం అనుపమే. అనుపమ అలా ఉంది మరి ఈ ట్రైలర్‌లో. ఈ స్క్వేర్‌లో కూడా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందనేది చెప్పడానికి వచ్చిన ట్రైలర్.. వంద శాతం ఆ డ్యూటీని నెరవేర్చింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రామ్ మిరియాల పాటలను స్వరపరచగా.. ఎస్. థమన్ నేపథ్యం సంగీతం సమకూర్చుతున్నారు.

Tillu Square Theatrical Trailer Talk:

Siddhu, Anupama Starring Tillu Square Trailer Out&nbsp; <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs