Advertisement
Google Ads BL

మిస్టర్ బచ్చన్.. మరీ ఏంటిది?


మిస్టర్ బచ్చన్.. మరీ ఏంటిది? ఇంత ఘాటుగానా? అంటూ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వదిలిన మిస్టర్ బచ్చన్ పోస్టర్‌కు కామెంట్స్ పడుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం మిస్టర్ బచ్చన్‌. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే  ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కారణం రవితేజ, భాగ్యశ్రీ బోర్సే ఈ పిక్‌లో దర్శనమిస్తోన్న తీరు అలా ఉంది మరి. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ హైలెట్‌గా ఉంటాయని చెప్పడానికి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే అనేలా.. ఈ పోస్టర్‌ ఉంది. ఇటివలే ఈ మూవీ కారంపూడిలో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. 

ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన నటించిన ఈగల్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థే నిర్మించడం విశేషం.

Mr Bachchan Valentines Day Special Poster :

Maharaja Ravi Teja and Bhagyashri Borse in Mr Bachchan  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs