Advertisement
Google Ads BL

జై హనుమాన్‌లో హనుమాన్ ఎవరంటే!


టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అంతా చూశారు. విడుదలైన చాలా చోట్ల ఇంకా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 300కి పైగా కోట్లను రాబట్టి.. ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజైన సినిమా విషయంలో సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాదు, ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుండి రాబోయే జై హనుమాన్‌పై ఎక్కడా లేని అంచనాలను పెంచేసింది.

Advertisement
CJ Advs

శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? అనే ప్రశ్నతో హనుమాన్‌ని ముగించిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్‌పై భారీగా అంచనాలను పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు జై హనుమాన్‌కి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా.. వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు జై హనుమాన్‌లో శ్రీరాముడిగా సూపర్ స్టార్ మహేష్‌ బాబుని, హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవిని అనుకుంటున్నట్లుగా ప్రశాంత్ వర్మ చెప్పి.. మరింత హైప్ క్రియేట్ చేశాడు.

ప్రస్తుతం వారిద్దరూ ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం లేదు కాబట్టి.. ఎవరు ఈ ప్రాజెక్ట్‌లో ఆ పాత్రలు పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడైతే హనుమంతుడి పాత్రకి యాక్టర్ సెట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కెజియఫ్ నటుడు యష్‌ని జై హనుమాన్‌లో హనుమంతుడి పాత్రకు సంప్రందించినట్లుగా టాక్ వినబడుతోంది. అలాగే, శ్రీరాముడి పాత్రకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని అనుకుంటున్నారని టాక్. చూడాలి మరి.. ఫైనల్‌గా ఎవరు ఆ పాత్రల్లో దర్శనమివ్వబోతున్నారో..

KGF Hero Plays HanuMan Role in Jai Hanuman:

Latest Gossips Viral on Prasanth Varma Jai Hanuman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs