Advertisement
Google Ads BL

స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి


సాయి పల్లవి.. స్టార్ హీరో కొడుకుతో సినిమా చేస్తుంది. సాయి పల్లవి విషయంలో ఇలాంటి వార్త వినడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ వినిపిస్తున్న వార్తలు అలానే ఉన్నాయి మరి. సాయి పల్లవి తనకు కథ నచ్చితే తప్ప సినిమా చేయదు. కథలో కూడా తనకి ప్రాధాన్యం ఉండాలి. అలాగే కొన్ని సన్నివేశాలకు దూరంగా ఉంటుంది. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే.. సాయి పల్లవి అంటే స్పెషల్‌గా మారిపోయింది. అలా అనీ ఆమెకు క్రేజ్ లేదా.. అంటే.. లేడీ పవర్ స్టార్‌గా బిరుదును సైతం సొంతం చేసుకుంది. 

Advertisement
CJ Advs

అలాంటి సాయి పల్లవి.. స్టార్ హీరో కొడుకుతో నటిస్తుందని అనగానే.. ఆ ప్రాజెక్ట్‌పై ఇంట్రస్ట్ కలగలేదు కదా.. సాయి పల్లవిపై అనుమానాలు పెరిగాయ్. తను గీసుకున్న గీతని సాయి పల్లవి దాటుతుందా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, గతంలో చాలా సార్లు ఆమె బాలీవుడ్ గురించి మాట్లాడింది. సౌత్ సినిమాలు చాలు అన్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో సినిమా చేస్తుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని లొకేషన్ స్టిల్స్ బయటికి రావడంతో.. సాయిపల్లవిని ఇష్టపడే వారంతా ఇలాగే అనుకుంటున్నారు.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేది చెప్పలేదు కదా.. ఆమిర్ ఖాన్. అవును ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ చేస్తున్న బాలీవుడ్ చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జపాన్‍లో జరుగుతోంది. ఈ సందర్భంగా సపారో స్నో ఫెస్టివల్‍లో జునైద్, సాయి పల్లవి సందడి చేశారు. ఈ సినిమాలో స్నో ఫెస్టివల్‌పై సన్నివేశాలు ఉండటంతో.. ప్రస్తుతం టీమ్ ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కొందరు సాయి పల్లవి బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తుందని సంతోషం వ్యక్తపరుస్తుంటే.. మరికొందరు మాత్రం, సాయి పల్లవికి అవసరమా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు.

Lady Power Star surprise with Star Hero Son:

Sai Pallavi spotted with Aamir Khan son Junaid
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs