మెగా స్టార్ ఇంటికి మెగా ప్రిన్స్ వచ్చేసింది. రామ్ చరణ్-ఉపాసన ల గారాల పట్టి మెగా మనవరాలు క్లింకారా ని చాలా ప్రేమగా స్పెషల్ గా చూసుకుంటున్నారు. చరణ్-ఉపాసనలు తమ కుమార్తె ఫొటోస్ ని రివీల్ చెయ్యకుండా ఇంకా ఇంకా సస్పెన్స్ లో పెడుతూ దాచేస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ తన కూతురిని బెంగుళూరు కి తీసుకెళ్లి అక్కడ సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ కూతురిని ఎంతో ప్రేమగా, కేరింగ్ గా చూసుకుంటాడు, అమ్మాయిలు తండ్రి కూచి అన్నట్టుగా చరణ్ ని చూడగానే కళ్ళెగరేస్తూ క్లింకార మొహం వెలిగిపోతుంది అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది.
తాజాగా క్లింకార తన ట్విన్ సిస్టర్స్ ని కలిసినట్టుగా ఉపాసన షేర్ చేసింది. ఉపాసన సిస్టర్ కి ట్విన్స్ పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే. ఉపాసన సిస్టర్ అనుష్ పాల ఆమె భర్త తమ పిల్లలని చేతుల్లోకి తీసుకోగా.. రామ్ చరణ్ క్లింకార ని ఎత్తుకుని ఉండగా.. పక్కనే ఉపాసన ఫొటోలకి ఫోజులిచ్చింది. క్లింకార తన ట్విన్ సిస్టర్స్ ని కలిసినట్టుగా ఉపాసన షేర్ చేసింది. ఉపాసన చెల్లెలి అనుష్ పాల ట్విన్స్ కి బారసాల ఫంక్షన్ జరగగా.. దానికి క్లింకార తన పేరెంట్స్ తో సహా హాజరైంది.
ఇప్పుడా పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఏమిటి చరణ్ నీ కూతురు మొహాన్ని ఎప్పుడు చూపిస్తావ్ అంటూ మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.