నందమూరి బాలకృష్ణ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అఖండ హిట్ తర్వాత బాలయ్య రేంజ్ మారడం కాదు.. బాలయ్య రూటు కూడా మార్చేశారు. ఒకపక్క అన్ స్టాపబుల్, మరోపాపక్క యాడ్స్ లో నటిస్తూ క్రేజీగా మారిపోయారు. వరస హిట్స్ తో పాటుగా వరసగా యాడ్ షూట్స్ అంటూ బాలయ్య మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. బోయపాటి అఖండ మూవీతో బాలయ్య రేంజ్ మారిపోయింది అని నందమూరి ఫాన్స్ కూడా మాట్లాడుతున్నారు. అఖండ తర్వాత వీర సింహారెడ్డి మాస్ హిట్, ఆ తర్వాత భగవంత్ కేసరి మూవీ కూడా సక్సెస్ అవ్వడంతో బాలయ్య సినిమాల బడ్జెట్ పెరిగింది.
అంతేకాకుండా ఆయన సినిమాల మర్కెట్ అదే రేంజ్ లో పెరిగిపోయింది. తాజాగా బాలకృష్ణ-బాబీ దర్శకత్వంలో రాబోతున్న మూవీ బడ్జెట్ 100 కోట్ల పైనే మాటే అంటున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకప్పుడు బాలకృష్ణ పై అంత బడ్జెట్ పెట్టాలంటే నిర్మాతలకి ఒక విధమైన కంగారు ఉండేది. కాని ఈమధ్యన బాలయ్య స్పీడు చూసి నిర్మాతలు ధైర్యం గా నటసింహం పై కోట్ల బడ్జెట్ కురిపిస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కిందే 100 కోట్ల వరకు కవర్ అవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు.
బాబీ తర్వాత బాలయ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తారని, అలాగే బోయపాటితో అఖండ సీక్వెల్ చెయ్యబోతున్నారు. బోయపాటి తోనా, లేదంటే హరీష్ తో ముందు ఉంటుందా అనేది ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీగా కనబడుతుంది.