Advertisement
Google Ads BL

ఒంటరితనమే బాగుంది: ధనుష్ మాజీ వైఫ్


హీరో ధనుష్ తన భార్య తో 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోకపోయినా విడిపోయి విడిగా ఉంటున్నారు. అటు స్టార్ హీరో, ఇటు సూపర్ స్టార్ కుమార్తె. వీరిద్దరూ పిల్లలు పెద్దవారయ్యాక, 18 ఏళ్ళకి విడిపోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఐశ్వర్య రజినీకాంత్ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుండగా.. ధనుష్ కూడా ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాడు. ఇక ఐశ్వర్య రజినీకాంత్ తాజాగా తండ్రి రజినీకాంత్ అతిధిగా.. లాల్ సలామ్ తెరకెక్కించగా.. ఆ చిత్రం నిరాశపరిచింది.

Advertisement
CJ Advs

తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ తన సింగిల్ లైఫ్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. గత రెండేళ్లుగా ఒంటరితనంతోనే సావాసం చేస్తున్నాను. ఆ ఒంటరితనాన్ని ఆస్వాదిస్తున్నాను, ఒంటరితనములో సురక్షితంగా ఉండగలం. ఆ ఏకాగ్రత నాకు బాగా నచ్చింది. 2015 తర్వాత పిల్లల కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. కానీ ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. అందుకే పిల్లలతో కొన్నాళ్ళు గడపాలనుకున్నాను. అప్పట్లో సినిమాలకి దూరంగా ఉన్నాను. ఒంటరి జీవితం లాగడమే సుఖంగా ఉంది అంటూ ఐశ్వర్య రజినీకాంత్ ఒంటరి జీవితంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Aishwarya Rajinikanth being alone safe:

Aishwarya Rajinikanth comments on single life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs