సమంత ఫైనల్ గా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. గత ఆరేడు నెలలుగా సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న సమంత హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటూ స్పెషల్ షూట్స్ పై శ్రద్ద పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకి దగ్గరగా ఉండే సమంత తాజాగా తీపి కబురు వినిపించింది. సిటాడెల్, ఖుషి షూటింగ్స్ తర్వాత మళ్ళీ సెట్స్ లోకి వెళ్ళని సమంత మధ్యలో ఫోటో షూట్స్ కోసం మాత్రం మేకప్ వేసి లైట్స్ కింద నిలబడింది. గత ఏడాది ప్రొడక్షన్ లోకి దిగినట్టుగా అనౌన్స్ చేసింది.
ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నటించడానికి సిద్దమైనట్టుగా సోషల్ మీడియా వేదికగా సమంత ప్రకటించింది. ఇప్పటికే చాలామంది సమంత మళ్ళీ నటిస్తావు అని అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఇకపై షూటింగ్స్ లో పాల్గొంటాను, ఫైనల్ గా సమయం వచ్చేసింది. కొన్ని రోజులుగా యాక్టింగ్ లేక నేను కూడా నిరుద్యోగిగానే ఉన్నాను. నా ఫ్రెండ్స్ తో కలిసి హెల్త్ పై ఓ పోడ్ కాస్ట్ పై ఓ కార్యక్రమం చేసాము, ఆ వీడియో త్వరలోనే విడుదల చేస్తాము అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత మళ్ళీ నటిస్తుంది అని తెలిసాక ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా.. ఆమె ఇకపై ఎలాంటి సినిమాలని ఎంపిక చేసుకుంటుందో అని నెటిజెన్స్ ఎదురు చూస్తున్నారు.