Advertisement
Google Ads BL

భట్టి మార్క్ బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లు!


ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు

Advertisement
CJ Advs

శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2024-25 అర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం 2,75,891 కోట్ల రూపాయలుగా ప్రకటించడం జరిగింది. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లు. ఇక ఏ రంగానికి ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించారో చూద్దాం. 

ఇక అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యువకులను రెచ్చగొట్టడం కాదని.. అక్కున చేర్చుకుని వారికి ఆసరాగా ఉంటామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయడంతో పాటు త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని భట్టి తెలిపారు. త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలిస్తామన్నారు. 

బీసీ సంక్షేమం 8 వేల కోట్లు

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1546 కోట్లు

విద్యారంగానికి రూ. 21389 కోట్లు

టీఎస్‌పీఎస్సీకి రూ.40 కోట్లు

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు

యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు

వైద్య రంగానికి రూ.11500 కోట్లు

విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2418 కోట్లు

విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు

నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు

గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు

మూసీ సుందరీకరణ, అభివృద్ధికి రూ.1000 కోట్లు

మూసి రివర్ ఫ్రంట్ అబ్బివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్

లండన్‌లో థేమ్స్ నదిలా మూసి నది అభివృద్ధి 

పాదచారుల జోన్ లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు 

పర్యావరణ పద్ధతిలో మూసి డెవలప్‌మెంట్..

ఆరు గ్యారెంటీల కోసం రూ.53196 కోట్లు 

పరిశ్రమల శాఖ రూ.2543 కోట్లు

ఐటి శాఖకు రూ.774కోట్లు

పంచాయతీ రాజ్ 40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు

వ్యవసాయ శాఖ రూ.19746 కోట్లు

ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు

ఎస్సీ సంక్షేమం రూ.21,874 కోట్లు

ఎస్టీ సంక్షేమం రూ.13,013 కోట్లు

మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు

Bhatti Mark budget is Rs 2.75 lakh crore!:

Telangana Presents Rs 2.75 Lakh Crore Vote On Account
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs