Advertisement

బేబీ దర్శకనిర్మాతలపై పోలీస్ కేసు


గత ఏడాది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా, చిన్న సినిమాగా నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-సిరాజ్ కలయికలో సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈచిత్రాన్ని SKN నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో కూడా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం తెలుగులో బేబీ హడావిడి సద్దుమణిగిపోయింది. ఇలాంటి సమయంలో బేబీ దర్శకనిర్మాతలపై కాపీ రైట్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

శిరీన్ శ్రీరామ్ అనే వ్యక్తి బేబీ కథని కొన్నేళ్ల క్రితమే  సాయి రాజేష్ కి చెప్పాను అని, కానీ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఆ కథని బేబీ గా సినిమా చేసారని శిరీన్ శ్రీరామ్ పోలీసులకి ఫిర్యాదు చేసాడు. 2013 లో తన సినిమాకి కెమేరామ్యాన్ గా పని చెయ్యాలని సాయి రాజేష్ ని అడిగాను, అప్పటినుంచి అతనితో పరిచయం ఏర్పడింది. 2015 లో కన్నా ప్లీజ్ అనే కథని రాసుకున్నాను, దానికి ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టుకోగా.. ఆ కథని అప్పట్లో నిర్మాత SKN కి వినిపించాను.. 

అప్పుడు ఆ సినిమా చెయ్యకుండా కొన్నేళ్ళకి అంటే 2023 లో అదే కథతో బేబీ ని తెరకెక్కించారు.. అంటూ అతను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. బేబీ కథ మొత్తం ప్రేమించొద్దు కథ తోనే తెరకెక్కింది, తన కథతో వాళ్ళు సినిమా ఎలా చేస్తారంటూ శిరీన్ శ్రీరామ్ పోలీసులు దగ్గర మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 

Police case against Baby director and producer:

Baby movie story copyright issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement