Advertisement
Google Ads BL

మహేష్ కూతురికి సైబర్ కష్టం


మహేష్ బాబు కుమార్తె సితార స్టార్ కిడ్ గా విపరీతమైన పాపులారిటీ ఉన్న అమ్మాయి. ఆమె సొంత టాలెంట్ తో అందరికి దగ్గరవుతుంది. సోషల్ మీడియాలో సితార ఘట్టమనేని పేరు మీద అన్ని ప్లాట్ ఫామ్స్ లో అకౌంట్స్ ఉన్నాయి. సితార డాన్స్ వీడియోస్, ఆమె చేసే సామజిక సేవ కార్యక్రమాలు, అలాగే ఫ్యామిలీతో కలిసి ఉండే పిక్స్ ని సితార సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి షేర్ చేస్తుంది. అయితే తాజాగా సితార సైబర్ కేటుగాళ్లు బారిన పడింది. 

Advertisement
CJ Advs

చాలారోజులుగా సైబర్ మోసగాళ్లు పాపులారిటీ అకౌంట్స్ ని హ్యాక్ చెయ్యడం, వారి అకౌంట్స్ నుంచి ఇతరులని డబ్బులు డిమాండ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సితార పేరు మీద అగంతకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మహేశ్ బాబు టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సితార ఘట్టమనేని పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్న విషయం మహేశ్ బాబు టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో వాళ్లు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సితార ఘట్టమనేని పేరుతో కొందరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ట్రేడింగ్, ఇన్వెస్టిమెంట్ లింకులు పంపుతున్నారు. ఈ విషయం మా దృష్టికి రాగానే తాము సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసినట్లుగా మహేష్ టీమ్ తెలిపింది.

Mahesh daughter has a hard time with cyber:

Mahesh daughter Sitara targeted, GMB issues advisory
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs