Advertisement
Google Ads BL

పల్లెటూరి అమ్మాయినంటూ అవమానించారు: మృణాల్


సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో అశేష అభిమానులని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ వచ్చే నెలలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో జంటగా ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సౌత్ లో క్రేజీ భామగా మారిన మృణాల్ ఠాకూర్ కి హిందీలో అదిరిపోయే బ్రేకిచ్చే ఛాన్స్ మాత్రం రావడం లేదు. హిందీ సీరియల్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ కి సీతారామం చిత్రం హీరోయిన్ గా బ్రేకిచ్చింది.

Advertisement
CJ Advs

అయితే మృణాల్ ఠాకూర్ గ్లామర్ గా కన్నా ట్రెడిషనల్ గానే హైలెట్ అయ్యింది. తాజాగా మృణాల్ తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసారంటూ సంచలనంగా మాట్లాడింది. తన బాడీ ఇలా ఉంది అలా ఉంది అని కామెంట్స్ చేసారు, మీరు చేసిన పాత్ర సెక్సీగానే ఉన్నా, మీరు మాత్రం సెక్సీగా లేరు, కానీ మీరు ఆ పాత్రకి దగ్గరగా కనిపించలేదని అన్నారు. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రని చూడకుండానే కామెంట్ చేసాడు, అసలు ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు అంటూ షాకింగ్ గా మాట్లాడారు. ఆ తర్వాత తాను నాకు క్షమాపణ కూడా చెప్పాడు.

ఓ సాంగ్ చెప్పినప్పుడు నువ్వు లావుగా ఉన్నావు, బరువు తగ్గమని అన్నారు. నా బరువుతో నాకు ఎలాంటి సమస్య లేనప్పుడు మీరెందుకు ఫీలవుతున్నారని గట్టిగానే ఇచ్చిపడేసాను. బాలీవుడ్ లో సినిమా కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు పడినట్లుగా మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. 

Mrunal Thakur talks about being body-shamed:

Mrunal Thakur talks about being body-shamed, slams insensitive comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs