కన్నడలో దర్శన్ హీరోగా తెరకెక్కిన కాటేరా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండానే కోట్లు కొల్లగొట్టింది. యాక్షన్ డ్రామాతో దర్శన్ హీరోగా వచ్చిన కాటేరా మూవీ కన్నడలో డిసెంబర్ నెలలో సలార్ తో పాటే విడుదలైంది. ఈ చిత్రం కంటెంట్ పరంగా కనెక్ట్ అవడంతో కన్నడ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. సలార్ చిత్రం విడుదలైన వారంలోనే కాటేరా కూడా విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసింది.
అప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలో విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకి కాటేరా ఈరోజు ఫిబ్రవరి 9 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. కాటేరా కథ నిజ జీవిత సంఘటన నుండి తెరకెక్కిన చిత్రం కావడంతో మౌత్ టాక్ తోనే 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం గత నెలలోనే ఓటిటిలోకి వస్తుంది అన్నప్పటికీ.. థియేటర్స్ లో కలెక్షన్స్ కొల్లగడుతూ ఉండడంతో.. ఈ చిత్రం కాస్త లేట్ గా ఇప్పుడు ఈ వారం ఓటిటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది.