Advertisement
Google Ads BL

వైరల్: సుమ కనకాల కుమారి ఆంటీ స్పూఫ్


యాంకర్ సుమ అంటే ఇష్టపడని వారు, తెలియని వారు ఉండరు. కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయి.. తనదైన టాలెంట్ తో ఇప్పటికీ బిజీగా ఉంటున్న సుమ కనకాల ఏం చేసినా సెన్సేషనే. తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ ని యూట్యూబ్ ఛానల్స్ వారు ఎలా ఎత్తారో, కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ ఒక్కసారిగా ఎంతగా ఫేమస్ అయ్యిందో.. తర్వాత ఆమె ఫేమస్ అవడంతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుందో అనేది కూడా మీడియా లో చూసాం. ఆమె దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ ఇలా అన్ని ఫేమస్ అయ్యాయి. సందీప్ కిషన్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కుమారి ఆంటీ దగ్గరకి వెళ్లి లంచ్ తిని దానిని ఒక్కసారిగా ఫేమస్ చేసాడు.

Advertisement
CJ Advs

అయితే కుమార్ ఆంటీ దగ్గర రెండు లివర్స్ కి 1000 రూపీస్ అంటూ చేసిన విషయం మీమ్స్ రూపంలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ తో యాంకర్ సుమ కనకాల చేసిన స్పూఫ్ వైరల్ గా మారింది. అంటాడు బ్రహ్మాజీ ఓ ఈవెంట్ లో సుమ నీ ఫుడ్ బావుంది అంటారు. అప్పుడే సుమ కుమార్ ఆంటీలా సుమ భోజనాలెప్పుడు అని బ్రహ్మాజీ అనగానే.. సుమ రంగంలోకి దిగిపోయి హాయ్ నాన్నా చెప్పండి, వెజ్జా, నాన్ వెజ్జా అంటూ అడుగుతూ.. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటి కర్రీ అంటూ సుమ చేసిన కామెడీ మాములుగా లేదు.

వన్ కర్రీ 100, టు కర్రీస్ 150 అంటూ సుమ కుమారి ఆంటీ చెప్పిన డైలాగ్స్ కి సరదాగా డాన్స్ చేస్తూ చెప్పింది. ఇక బ్రహ్మాజీ ఫుడ్ చాలా బావుంది.. మీరు కూడా ట్రై చెయ్యండి అంటూ సరదాగా బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్ తో ఈ స్పూఫ్ ఎండ్ అయ్యింది. ప్రస్తుతం కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ తో సుమ చేసిన స్పూఫ్ అందరికి తెగ నచ్చేసింది.

Suma Funny Spoof On Famous Street Food Kumari Aunty:

Suma Kanakala Funny Spoof On Famous Street Food Kumari Aunty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs