సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో గెస్ట్ రోల్ లో నటించిన లాల్ సలామ్ సినిమా నేడు ఫిబ్రవరి 9 న థియేటర్లోకి వచ్చేసింది. విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వంటి వారు నటించిన ఈచిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ షోస్, చెన్నై లో ప్రీమియర్స్ పూర్తి కాగా.. లాల్ సలామ్ ఇలా ఉంది, సూపర్ స్టార్ యాక్షన్ తో ఇరగ్గొట్టారు అంటూ ఓవర్సీస్ పబ్లిక్ తమ స్పందనని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
మత సామరస్యం అనే ప్రధాన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. లాల్ సలామ్ ఇచ్చిన సామజిక సందేశం అందరిని ఆకట్టుకున్నట్లుగా రజిని ఫాన్స్ చెబుతున్నారు. రజినీకాంత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాషా లెవల్లో సూపర్ స్టార్ లాల్ సలామ్ ఎంట్రీ ఉన్నట్లుగా ట్వీట్లు వేస్తున్నారు. ఆయన కనిపించేది అతిధి పాత్రే అయినా.. కథ మొత్తాన్ని సూపర్ స్టార్ ఆక్రమించేశారని మాట్లాడుతున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్, BGM సినిమాలో బాగా హైలెట్ అవడమే కాకుండా.. సూపర్ స్టార్ సీన్స్ ని ఎలివేట్ చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషించాయని రజినీ అభిమానులు చెబుతున్నారు.
అయితే లాల్ సలామ్ ఎంతో పవర్ ఫుల్ సబ్జెక్ట్, కానీ ఐశ్వర్య రజినీకాంత్ దానిని డీల్ చేయలేకపోయారు, రజినీకాంత్ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంది, అది ఫాన్స్ ని డిస్పాయింట్ చేసే వార్తే, ఇక విష్ణు విశాల్-విక్రాంత్ ల సీన్స్ మొత్తం ఒకదానిని ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు, లాల్ సలామ్ థియేటర్స్ కి రజినీకాంత్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని వెళితే పూర్తిగా నిరాశపరుస్తుంది, అయితే రజనీకాంత్ నటన క్లైమాక్స్‌లో టెర్రిఫిక్. విష్ణు వశాల్, విక్రాంత్ పెర్ఫార్మెన్ప్ అదుర్స్ అంటూ నెటిజెన్స్ లాల్ సలామ్ చూసిన నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.