కమెడియన్ గా అందరిని మెప్పించి బలగంతో దర్శకుడిగా బలమైన ముద్ర వేసిన వేణు టిల్లు.. ఇప్పుడు తన తదుపరి మూవీ కోసం కథని సిద్ధం చేసుకున్నాడు. గత ఏడాది బలగం చిత్రంతో బ్రహ్మాండమైన హిట్ కొట్టిన వేణు ఆ తర్వాత చాలారోజులు ఛిల్ అయ్యి నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. తన రెండో సినిమాని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చెయ్యబోతున్న వేణు ఏ హీరోకి కథ వినిపించి ఓకె చెయ్యబోతున్నాడో అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. అప్పట్లో హీరో నాని తో బలగం వేణు సినిమా అన్నారు.
ఇప్పుడు అదే నిజమంటున్నారు. హాయ్ నాన్న హిట్ తర్వాత నాని వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే క్రేజీ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఓ భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సరిపోదా శనివారం యూనిట్ ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉంది. అయితే బలగం వేణు తన దగ్గర ఉన్న కథతో నానిని కలిసి కథని నేరేట్ చెయ్యగా.. కథ విని ఇంప్రెస్స్ అయిన నాని సరిపోదా శనివారం తర్వాత వేణు తోనే సినిమా చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
సరిపోదా శనివారం తర్వాత నాని ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అనే ఆతృత ప్రేక్షకుల్లో ఉన్నా, సుజిత్ తో నాని సినిమా ఉంటుంది అన్నా.. ప్రస్తుతం వేణు తోనే నాని తదుపరి మూవీ ఉండొచ్చు, అది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే అంటూ సోషల్ మీడియా టాక్. మరి వేణు ఈసారి ఎలాంటి కథతో సినిమా చేస్తాడో చూడాలి.