Advertisement
Google Ads BL

కేసీఆర్ బాటలోనే జగన్ యాగం చేస్తారా?


రాజశ్యామల యాగం చేస్తే అధికారం రేసు గుర్రం వేసుకుని వచ్చి మరీ తమను చేరుతుందనేది ఎప్పటి నుంచో వస్తున్న సెంటిమెంట్. ఇది ఈనాటిది కాదు.. రాజుల కాలం నుంచి వస్తోంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఎన్నికలనగానే రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. రెండు పర్యాయాలు అయితే కేసీఆర్ అధికారాన్ని చేపట్టారు కానీ మూడోసారి మాత్రం రాజశ్యామల యాగం కూడా ఆయనను కాపాలేకపోయింది. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2019లో ఏపీ ఎన్నికలకు ముందు ఈ యాగాన్ని చేపట్టారు. రాజ్యాధికారాన్ని దక్కించుకున్నారు. ఈసారి మళ్లీ రాజశ్యామల యాం చేయాలని జగన్ భావిస్తున్నారట. 

Advertisement
CJ Advs

జగన్‌ను ఆహ్వానించిన శారదా పీఠం..

ఈ క్రమంలోనే విశాఖ శారదా పీఠం నుంచి జగన్‌కు పిలుపు వచ్చిందట. యాగం చేసేందుకే శారద పీఠం నుంచి పిలుపు వచ్చిందని అంతా అనుకుంటున్నారు. నిజానికి జగన్ హిందూ దేవుళ్లను నమ్మరు. కానీ ప్రస్తుతం జగన్‌కు అధికారం దక్కించుకునేందుకు అన్ని దార్లూ మూసుకుపోయాయి. దీంతో దేవుడే దిక్కని భావిస్తున్నారట. ఈ నెల 15 నుంచి 19 వరకూ విశాఖలోని శారదా పీఠంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వార్షికోత్సవాల చివరి రోజున రాజశ్యామల యాగం నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రానుండటంతో రాజశ్యామల యాగంలో పాల్గొనాలని శారదా పీఠం జగన్‌ను ఆహ్వానించింది. ఈసారి అన్ని దార్లూ మూసుకుపోవడంతో యాగంలో జగన్ తప్పక పాల్గొంటారని టాక్.

రెండు టర్మ్స్ ఉంటారట..

కేసీఆర్‌ను పక్కాగా జగన్ ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే సిట్టింగ్‌లను మార్చక పోవడం వల్లనే కేసీఆర్ ఓడిపోయి ఉంటారని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వే చేయించి మరీ సిట్టింగ్‌లను మారుస్తున్నారు. మరి గత ఎన్నికల్లో రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు కాబట్టి జగన్ ఈసారి యాగం చేస్తారా? అనేది కూడా సందేహంగానే మారింది. జ్యోతిష్యలైతే రెండు సార్లకు మించే జగన్ సీఎంగా ఉంటారని చెప్పారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలంతా గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి పక్కాగా ఈసారి కూడా జగన్ అధికారంలో ఉంటారని చెబుతున్నారు. కానీ రెండు టర్మ్స్ అన్నారు కానీ అది వరుసగా.. అన్నారా? అనేది వైసీపీ నేతలు గుర్తించాలి. మొత్తానికి రాజశ్యామల యాగాన్ని జగన్ చేస్తారా? లేదా? అనేది తెలియాలి.

Will Jagan perform Yagam on the path of KCR?:

Sarada Peetham invited Jagan..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs