Advertisement
Google Ads BL

బిడ్డ విషయంలో ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్


బిడ్డ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుని, బిడ్డ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ముక్కు అవినాష్-అనూజలు ఎపుడూ అనుభవించని బాధని అనుభవిస్తున్నారు. జబర్దస్త్ అవినాష్ భార్య అనూజాకి పుట్టిన బిడ్డ కోల్పోవడంతో అవినాష్ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని అవినాష్ జనవరిలోనే తెలియజేస్తూ తనని ఎవరూ ప్రశ్నించవద్దు, తాము దుఃఖంలో ఉన్నామంటూ చెప్పడంతో అందరూ అతనికి సానుభూతిని తెలియజేసారు.

Advertisement
CJ Advs

జనవరిలో అవినాష్ తన బిడ్డని కోల్పోవడంపై ఇన్స్టా వేదికగా మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. అందులో అవినాష్ ఇలా రాసుకొచ్చాడు..

నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్.. అంటూ అవినాష్ రాసుకొచ్చాడు.

తాజాగా అవినాష్ ఈ విషయమై స్పందిస్తూ.. నా బిడ్డ చనిపోయినప్పుడు నాకు సానుభూతి తెలుపుతూ చాలామంది ఫోన్స్ చేసారు, ఇండస్ట్రీ నుంచి పలువురు పలకరించేందుకు చూసారు. కానీ నేను నా బాధలో ఉండి సరిగ్గా ఫోన్స్ కూడా లిఫ్ట్ చెయ్యలేదు. అయినప్పటికీ నన్ను పలకరించేందుకు చాలామంది ప్రయత్నం చేసారు. మా మీద ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అదో కరిగిపోయిన మేఘం. దేవుడు మాకు అలా రాసిపెట్టాడు. జీవితంలో ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి.. అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.

Avinash is the first time to respond to the issue of his child:

Mukku Avinash Emotional Post about his Child
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs