ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె లాంటి టాప్ స్టార్స్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD పార్ట్ 1 మే 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. జనవరి 12 న విడుదల కావాల్సిన ఈచిత్రం పోస్ట్ పోన్ అయ్యి అది మే 9 కి వెళ్ళింది. ఇకపై కల్కి పోస్ట్ పోన్ అవ్వదు. ఖచ్చితంగా అనుకున్న తేదీకే కల్కి విడుదల ఉంటుంది అంటున్నా.. మరోపక్క ప్రభాస్ కల్కి షూటింగ్ లో పాల్గొనడంపై చాలారకాల అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం Kalki 2898 AD పార్ట్ 1 షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది, ప్రస్తుతం జరిగేది పార్ట్ 2 షూటింగ్, పార్ట్ 1 కి సంబంధించిన షూటింగ్ ఫినిష్ కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్త కావొస్తున్నాయి. నాగ్ అశ్విన్ అండ్ టీమ్ విఎఫెక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. షూటింగ్ మాత్రం ఎప్పుడో పూర్తయ్యింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ పార్ట్ 2 ని షూట్ చేసుకుంటున్నాడు, కల్కి 2898 AD అనుకున్న తేదికి మే 9 నే థియేటర్స్ లోకి వస్తుంది అంటున్నారు. మరి సలార్ తో హిట్ కొట్టిన ఆరు నెలలకే మరోసారి కల్కి తో అభిమానులకి ట్రీట్ ని సిద్ధం చేస్తున్నారు ప్రభాస్.