Advertisement
Google Ads BL

ఫైనల్లీ అదః శర్మ కేరళ స్టోరీ ఓటిటి రిలీజ్


గత ఏడాది మే 5 న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన ది కేరళ స్టోరి కాంట్రావర్సీలకి నెలవుగా మారింది. విడుదలకు ముందు ది కేరళ స్టోరి ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ విడుదలయ్యాక ఈ చిత్రం పై మొదలైన కాంట్రవర్సీ.. పెరిగి పెరిగి కలెక్షన్స్ దుమ్మురేపడానికి కారణమయ్యింది. అదాశర్మ, యోగాతి బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ నటించిన ఈ చిత్రాన్ని సుదీప్టో సేన్ డైరెక్ట్ చేసారు. ఆ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయినా.. ఓటిటీ కి వచ్చేసరికి మాత్రం చాలా గ్యాప్ వచ్చేసింది.

Advertisement
CJ Advs

తొలివారమే 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫైనల్ రన్ లో ఇండియాలోనే 250 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. హిందీలో అయితే కలెక్షన్స్ వరద పారింది. థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అయిన ది కేరళ స్టోరీని ఎప్పుడెప్పుడు ఓటిటిలో వీక్షిద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ది కేరళ స్టోరి సినిమా డిజిటిల్ రైట్స్ కొనడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు, అసలు ఓటిటీ రిలీజ్ కి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు.

దానితో కేరళ స్టోరీ ఓటిటీ రిలీజ్ చాలా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ జీ5 సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాను ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా జీ5 నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. ఫైనల్లీ ది కేరళ స్టోరీ ఓటిటీ రాక కన్ ఫామ్ అయ్యింది.

The Kerala Story OTT Release Date Announced:

The Kerala Story OTT release fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs