ప్రస్తుతం సౌత్ హీరోయిన్స్ అందరిలో రష్మిక మందన్న ది రేజింగ్ హ్యాండ్. ఎందుకంటే రష్మిక మందన్న పుష్ప, యానిమల్ లాంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా హిట్స్ కొట్టి ఉండడంతో ఆమె డిమాండ్ బాగా పెరిగింది. ప్రెజెంట్ పూజ హెగ్డే కూడా డల్ అయ్యింది. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన రష్మిక.. ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో నటిస్తోంది. రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ లాంటి హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లోను ఆడిపాడుతుంది. నేషనల్ లెవల్లో ఉన్న క్రేజ్ తో రష్మిక యనమల్ కి భారీగా పారితోషకం అందుకుని అనే ప్రచారం జరిగింది.
అలాగే లేడీ ఓరియెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ మూవీకి రష్మిక 3 కోట్లు అందుకుందట. అయితే ఇప్పుడు రష్మిక తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని టాక్. సౌత్ లోను అందులోను రశ్మికని స్టార్ హీరోయిన్ ని చేసిన తెలుగులో ఓ ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తే రష్మిక మాత్రం 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. మరి ఈ పారితోషకం తనకి ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఉన్న పాపులారిటీ చూసే ఇవ్వాలని అడుగుతుంది. గతంలోనూ రష్మిక ఈ పారితోషకం విషయంలో కష్టపడుతున్నాము, అడిగితే తప్పేమిటి అన్న కామెంట్స్ కూడా చేసింది. మరోపక్క రష్మికకు ఫుల్ పాపులారిటీ ఉన్నా.. కాస్త రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాలని అంటున్నారు. మరి ఈ సలహాని రష్మిక కన్సిడర్ చేస్తుందేమో చూడాలి.