దేవర పై మేకర్స్ సైలెన్స్ ని యంగ్ టైగర్ అభిమానులు భరించలేకపోతున్నారు. ఎన్టీఆర్-కొరటాల కాంబోలో భారీ ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర ఏప్రిల్ 5 విడుదల అంటూ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఎనౌన్స్ చేసారు. షూటింగ్ మొదలయ్యాక చిన్నపాటి బ్రేక్ కూడా లేకుండా ఎన్టీఆర్ అండ్ టీమ్ కష్టపడుతుంది. ఈ లెక్కన దేవర ఖచ్చితంగా ఏప్రిల్ 5 న వస్తుంది అని ఫిక్స్ అయిన సమయంలో దేవర లో కీలక పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలవడంతో దేవర విడుదలపై ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఏప్రిల్ 5 కి దేవర రావాడంట లేదు, అసలు గ్లిమ్ప్స్ అప్పుడే సమ్మర్ రిలీజ్ అన్నారు.. దానిని బట్టి దేవర విడుదల పోస్ట్ పోన్ అయినట్లే అన్నారు. ఈలోపులో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని ఏప్రిల్ 5 విడుదల అంటూ ఫిక్స్ అయ్యాడు. బయట ఇంత జరుగుతున్నా దేవర మేకర్స్ మాత్రం సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. దేవర యాక్షన్ ఎపిసోడ్స్ పై ఇచ్చిన అప్ డేట్స్ అంత ఫాస్ట్ గా విడుదల పోస్ట్ పోన్ విషయాన్ని చెప్పకపోవడంపై ఎన్టీఆర్ ఫాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.