కొన్నాళ్లుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు, వెబ్ సీరీస్ లు ఏవి ఆమెకి అనుకున్నంతగా సక్సెస్ ఇవ్వలేకపోతున్నాయి. కెరీర్ లో డల్ గా కనిపించినా.. లావణ్య త్రిపాఠి మాత్రం ఏదో ఒక షూటింగ్ తో బిజీగానే కనిపిస్తుంది. ఇక గత ఏడాది వరుణ్ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నాక ఆమె నటన కి ఫుల్ స్టాప్ పెట్టే విషయంలో చాలా ప్రచారం జరిగింది. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం నటనకు బ్రేక్ ఇచ్చేది లేదు అని ఖచ్చితంగా తెగేసి చెప్పింది.
ఇక ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ రీసెంట్ గానే డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి విడుదలైంది. అయితే పెళ్ళికి ముందు లావణ్య కెరీర్ ఎంత డల్ గా ఉందో.. పెళ్లి తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించింది. అంటే మిస్ పెర్ఫక్ట్ అంతగా లేదు,మెగా కోడలు ఉంచి ఇది ఊహించలేదు అంటూ ఓటిటి ఆడియన్స్ మాట్లాడుతున్నారు. క్రిటిక్స్ కూడా మిస్ పర్ఫెక్ట్ కి పూర్ రివ్యూస్ ఇచ్చారు. లావణ్యకి పెళ్లి తర్వాత కూడా సక్సెస్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదు. మరి మెగా కోడలు నుంచి రాబోయే తదుపరి ప్రాజెక్ట్ ఏమిటో.. అని అందరిలో ఆసక్తి మాత్రం మొదలయ్యింది.