ధమాకా తర్వాత వరస ఫెయిల్యూర్స్ తో రవితేజ కెరీర్ డల్ అయినా.. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే.. ప్రేక్షకుల్లో అప్పటికప్పుడు అంచనాలు మొదలైపోతాయి. టైగర్ నాగేశ్వరావు అప్పుడు అంతే. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఆయన అభిమానులే కాదు.. ప్రేక్షకులూ ఎక్స్ పెక్ట్ చేసారు. అయితే రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఈగల్ ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. దానికి అనుగుణం మేకర్స్ బాగా ప్రమోషన్స్ కూడా చేసారు.
కానీ సంక్రాంతి హెవీ కాంపిటీషన్ నుంచి ఈగల్ ని తప్పించి సోలో డేట్ ఇస్తామని ఒప్పించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 9 న ఈగల్ విడుదల కాబోతుంది. మరో నాలుగు రోజుల్లో ఈగల్ థియేటర్స్ లోకి రాబోతుంది. డబ్బింగ్ మూవీ లాల్ సలాం, యాత్ర 2 రేస్ లో ఉన్నా.. ఈగల్ కే ఎక్కువమంది ప్రేక్షకులు ఓటేస్తారు. అటు ప్రమోషన్స్ పరంగాను ఈగల్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతుంది. ఇంత చేసినా.. చేస్తున్నా ఈగల్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవడం లేదు.
ఈగల్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈగల్ బుకింగ్స్ ఓపెన్ చేసినా.. బుక్ మై షోలో ఈగల్ టికెట్స్ తెగడం లేదు. హైదరాబాద్ మల్టిప్లెక్స్ ల్లో ఈగల్ టికెట్ బుకింగ్స్ మరీ వీక్ గా ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ మొత్తం ఎగ్జామ్స్ ఫీవర్ లో కనిపిస్తుంటే.. వారి పేరెంట్స్ అంతా టెన్షన్ మోడ్ లో ఉన్నారు. మరోపక్క ఈగల్ వాయిదా ఎఫెక్ట్ కూడా ఉంది అంటున్నారు. అప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు ఈగల్ విడుదలకి ముందు కనిపించడం లేదు. మరి ఈ లో బజ్ తో ఈగల్ కి ఎంతవరకు ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.