హీరో రామ్-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ అంటూ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించి ఇప్పుడు దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని దించేందుకు చక చకా రంగం సిద్ధం చేస్తున్నారు. స్కంద రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరో రామ్.. సైలెంట్ గా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై ఓ న్యూస్ వైరల్ గా మారింది.
హీరో రామ్ పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ పూర్తిగా సరికొత్త మేకోవర్ లో కనిపిస్తాడని, కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ అవ్వడమే కాకుండా, యాక్షన్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీ యాక్షన్ తో సాగుతుందని ఆ వార్త సారాంశం. మరి రామ్ ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ లుక్ లో కేక పెట్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ చూసాక ఈ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మార్చ్ 8 శివరాత్రి కానుకగా ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చెందుకు పూరి శతవిధాలా కష్టపడుతున్నాడు.