Advertisement
Google Ads BL

తిరుపతికి రామ్ చరణ్ ఫ్యామిలీ


రామ్ చరణ్ తన భార్య ఉపాసన, పాప క్లింకార తో కలిసి తిరుమల తిరుపతికి వెళుతున్నారు. తన కూతురు పుట్టాక మొదటిసారిగా రామ్ చరణ్ భార్య కుమార్తెతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. రామ్ చరణ్-ఉపాసనలకు జూన్ 20 న క్లింకార జన్మించింది. ఆ తర్వాత తమ పాప తో వెకేషన్స్ కి వెళ్లిన చరణ్ రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి బెంగుళూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఇప్పుడు చరణ్ తన ఫ్యామిలీతో ప్రత్యేకంగా తిరుపతికి వెళ్ళటానికి కారణం.. క్లింకార కి పుట్టెంటుకలు(తలనీలాలు) తీయించడానికి అని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

పదకొండేళ్ల తర్వాత తమ మధ్యకు వచ్చిన కుమార్తె క్లింకారని ఉపాసన-చరణ్ దంపతులు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. పాప మొహాన్ని రివీల్ చెయ్యకుండా అందరిని సస్పెన్స్ లో ఉంచిన చరణ్ దంపతులు క్లింకారకి సంబందించిన ఏ కార్యక్రమమైనా ఎంతో ప్రత్యేకంగా జరిపిస్తున్నారు. మరి ఈ తల నీలాల కార్యకమానికి మెగాస్టార్ దంపతులు వెళుతున్నారో.. లేదంటే కేవలం రామ్ చరణ్ దంపతులు మాత్రమే వెళతారా అనే విషయంలో మెగా ఫాన్స్ లో ఉత్సుకత కనబడుతుంది. 

Ram Charan on the way to Tirupati :

Ram Charan on the way to Tirupati for Klin Kaara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs