మెగా అభిమానులు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ ని వేడుకుంటున్నారు, మేలుకోండి శంకర్ సర్.. మా చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ప్రకటించండి సర్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. షూటింగ్ మొదలై రెండేళ్లు దాటి పోయింది. కేవలం టైటిల్, ఫస్ట్ లుక్ తప్ప ఇంకే అప్ డేట్ లేకుండా అభిమానులను చాలా వెయిట్ చేయిస్తున్నారు శంకర్. మామూలుగానే శంకర్ ఆచి తూచి అవుట్ ఫుట్ రాబడతారు. కానీ ఇక్కడ ఆయనకి ఇండియన్ 2 షూటింగ్ వలన గేమ్ చేంజర్ షూటింగ్ మరింతగా ఆలస్యమవుతుంది. అందుకే విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నారు.
ప్యాన్ ఇండియా మూవీకి అల్లాటప్పా డేట్ లాక్ చేస్తే కుదరదు. అందుకే శంకర్-దిల్ రాజులు అలోచించి గేమ్ ఛేంజర్ కి వినాయకచవితి అయినా.. లేదంటే దసరా నవరాత్రుల్లో అయినా విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని చూస్తున్నారట. ఖచ్చితంగా దసరా డేట్ అయితే లాక్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నా.. ఆ డేట్ విషయంలో మరికాస్త క్లారిటీ రావాల్సి ఉండడంతో.. ఆ అప్ డేట్ ఆలస్యమవుతుంది అంటున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం గేమ్ ఛేంజర్ విడుదల తేదీ కోసం ఫైట్ చేస్తున్నారు.
మరి రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27 వరకు గేమ్ ఛేంజర్ డేట్ పై మేకర్స్ ఇలానే సస్పెన్స్ కొనసాగిస్తారా.. లేదంటే మరో అకేషన్ చూసి రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారో అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ.!