రకుల్ ప్రీత్ పెళ్ళికి రెడీ అయ్యింది. ఈ నెలలోనే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో పెళ్లి పీటలెక్కేందుకు చక చకా సిద్దమైపోతుంది. ఫిబ్రవరి 22 న గోవా వేదికగా రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీ పెళ్లి జరగబోతుంది అనే న్యూస్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ముందుగా రకుల్-జాకీలు విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ వేదికని ఇప్పుడు గోవాకి మార్చుకున్నారట. గోవాలో జరగబోయే రకుల్ ప్రీత్ పెళ్ళికి కేవలం స్నేహతులు, కుటుంభ సభ్యులతో పాటుగా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.
మరి ఈ నెల 22 న పెళ్లి,అంతకుముందు జరగాల్సిన ముద్దు ముచ్చట్లు లో భాగంగా రకుల్ తన ఫ్రెండ్స్ కి బ్యాచులర్ పార్టీ ఇచ్చేసింది. అది కూడా థాయ్ ల్యాండ్ బీచ్ లో, సముద్రంలో బోట్ పై ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తూ రకుల్ ప్రీత్ బ్యాచులర్ పార్టీలో ఎంజాయ్ చేసింది. రకుల్ ఇచ్చిన ఈ పార్టీకి ఆమె ఫ్రెండ్స్ ప్రగ్య జైస్వాల్, లక్ష్మి మంచు, సీరత్ కపూర్, ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ లతో పాటుగా మరికొంతమంది ఫ్రెండ్స్ పాల్గొన్నారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ బ్యాచులర్ పార్టీకి సంబందించిన పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి రకుల్ ప్రీత్ బ్యాచలర్ పార్టీ అదిరిపోయింది.. ఇక పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.