మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ చిత్రంలో నటించిన త్రిష మళ్ళీ చాలా ఏళ్ళ గ్యాప్ తో ఆచార్యలో చిరుకి జోడిగా నటించాల్సి ఉంది. ఆచార్య సెట్స్ లోకి కూడా వచ్చింది. కానీ ఆమె తన కేరెక్టర్ పై ఉన్న అపనమ్మకంతో అప్పట్లో ఆచార్య సెట్స్ నుంచి వాకౌట్ చేసింది అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత చిరుకి జోడిగా త్రిష విశ్వంభరలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. బింబిసార దర్శకుడు వసిష్ఠతో మెగాస్టార్ విశ్వంభర అనే క్రేజీ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. తాజాగా చిరు విశ్వంభర సెట్స్ లోకి ఎంటర్ అయ్యారు.
ప్రస్తుతం జరుగుతున్న విశ్వంభర షెడ్యుల్ లో కొన్ని కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు వసిష్ఠ. ఫిబ్రవరి రెండోవారంలో అంటే 9, 10 తారీకుల్లో ఒక సాంగ్ తీయబోతున్నారట. ఈ షెడ్యూల్ కి హీరోయిన్ త్రిష ఎంటర్ కానున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. అందులో ముఖ్యమైన పాత్రకి త్రిషని ఎంపిక చేశారట దర్శకుడు వసిష్ఠ. ప్రస్తుతం త్రిష తమిళనాట ఫుల్ ఫామ్ లో ఉంది. అక్కడ స్టార్ హీరోస్ అయిన కమల్ హాసన్, అజిత్ లతో జోడి కడుతుంది.
ఇప్పుడు మెగాస్టార్ చిరుకి జోడిగా వచ్చింది. ఈ క్రేజీ కాంబో పై మంచి అంచనాలున్నాయి. సోషల్ మీడియాలో త్రిష ఫొటో షూట్స్ షేర్ చెయ్యగానే వైరల్ అవుతున్నారు. ఇవన్నీ చూసాక పొన్నియన్ సెల్వన్ క్రేజ్ ఆమెకి బాగా హెల్ప్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహము కనిపించడం లేదు.