Advertisement
Google Ads BL

వ్యక్తిగత విమర్శలపై చిరు సంచలన కామెంట్స్


మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడంతో ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క చిరు వ్యక్తిగతంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈరోజు ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరయ్యారు. గత రాత్రి మెగాస్టార్ కోడలు ఉపాసన హోస్ట్ చేసిన పార్టీకి పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి హాజరయ్యారు.  తాజాగా ఆయన రాజకీయాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

Advertisement
CJ Advs

ఈరోజు ఆదివారం చిరు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పద్మ అవార్డుల అభినందన సభలో పాల్గొన్నారు. అక్కడ చిరు తాను రాజకీయాలను నుంచి తప్పుకోవడంపై సరైన క్లారిటీతో పాటుగా సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. రాజకీయాలు ఎప్పుడైనా హుందాగా ఉండాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టగలిగితేనే పాలిటిక్స్ లో కంటీన్యూ అవ్వొచ్చనే స్థితి నేడు నెలకొంది అంటూ చిరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చిరు ఈమాటలను జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవే అని, పవన్ కళ్యాణ్ ని జగన్ అలాగే ఆయన మంత్రులు వ్యక్తిగతంగా దూషించడం నచ్చకే చిరు ఇండైరెక్ట్ గా ఇలాంటి కామెంట్స్ చేసారంటూ జనసైనికులు మాట్లాడుకుంటున్నారు. 

Chiranjeevi sensational comments on personal criticism:

Chiranjeevi sensational comments on quit politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs