బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన స్నేహాలు బయట కనిపించడం లేదు. బిగ్ బాస్ లో స్నేహితులుగా ప్రాణం ఇచ్చేంత స్నేహంతో కనిపించిన వారు బయటికొచ్చాక ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయడం లేదు. ముఖ్యంగా సీజన్ 5 లో స్నేహితులుగా కనిపించిన సోహెల్, అఖిల్ ఇప్పుడు మాత్రం ఆ స్నేహం గురించి మట్లాడడం లేదు. సీజన్ 5 విన్నర్ అభిజిత్ తో అఖిల్ అప్పుడప్పుడు గొడవపడడమే కాదు, అఖిల్ కి సపోర్ట్ గా సోహెల్ ఉండేవాడు. సోహెల్, అఖిల్ మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ లా కనిపించారు. అఖిల్ రన్నర్ గా, సోహెల్ 25 లక్షల సూట్ కేసుతో సీజన్ 5 నుంచి బయటికొచ్చాక కొన్నాళ్ళు స్నేహంగానే కనిపించారు.
తాజాగా సోహెల్ అఖిల్ తో ఇంతకుముందు ఉన్న స్నేహం లేదు, కలిసి లంచ్ కి వెళదామంటే లేదు ఇంటికెళ్ళాలి అని తన రూమ్ కి వెళ్ళాడు, తర్వాత కూడా అఖిల్ ప్రవర్తన వేరేలా ఉంది అంటూ చెప్పాడు. అఖిల్ కూడా సోహెల్ తనకి ప్రాణ స్నేహతుడు కాదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని షాకిచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు కాదు. బెస్ట్ అంటే నాకు సలహాలివ్వాలి, కెరీర్ కి హెల్ప్ అవ్వాలి, నన్ను కేరింగ్ గా బాగా చూసుకోవాలి, కానీ సోహెల్ అలా కాదు. అందుకే తాను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
అంటే దీనిని బట్టి అఖిల్ కి సోహెల్ కి మధ్యన స్నేహం లేదు, వీరి మధ్యన స్నేహం మొత్తం చెడిపోయింది అనుకునేలా వీరి తాజా ఇంటర్వూస్ ఉన్నాయి.