కొద్దిరోజులుగా శ్రీముఖి కళ్ళు తిప్పుకోలేని గ్లామర్ షో తో యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. బ్యూటిఫుల్ లుక్స్ తో కెవ్వు కేక అనిపించే అవుట్ ఫిట్స్ తో శ్రీముఖి బుల్లితెర మీద అదరగొట్టేస్తుంది. ఎక్కడ చూసినా శ్రీముఖి పేరే. స్టార్ మా, ఈటివి, జీ తెలుగు ఇలా ఏ ఛానల్ లో చూసినా.. శని, ఆదివారాల్లో బుల్లితెర షోస్ లో శ్రీముఖి యాంకరింగ్ కనబడుతుంది. సీరియల్ స్టార్స్ తో, సింగర్స్ తో ఇలా అందరితో ఆటాడించే క్రేజీ యాంకర్ గా శ్రీముఖి మారిపోయింది.
ఒకప్పుడు బొద్దుగా కనిపించిన శ్రీముఖి ఇప్పుడు కాస్త సన్నబడి గ్లామర్ డోస్ పెంచేసింది. రకరకాల అవుట్ ఫిట్స్ తో శ్రీముఖి అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. తాజాగా బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో శ్రీముఖి జాగాలో మల్లెపూలు తురుముకుని కొత్తగా కనిపించింది. గట్టిగా బిగించి వేసిన జడలో మల్లెపూల దండని పెట్టుకుని, ఆ దండని అలా ముందుకు వేసుకుని శ్రీముఖి చాలా స్పెషల్ గా కనిపించింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.