Advertisement
Google Ads BL

కవితపై బండ్ల గణేష్ ఫైర్


KCR కుటుంబంపై పడి ఏడుస్తున్న రేవంత్ రెడ్డి 22 కుటుంబాలకు కాంగ్రెస్ టికెట్లు ఎలా ఇచ్చారంటూ BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక దృక్కోణం కొరవడిందని, ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని ఆమె మండిపడ్డారు. ప్రియాంక గాంధీ కనీసం దేశంలో ఏ ఒక్క గ్రామం నుంచి అయినా సర్పంచ్ గా గెలిచిందా, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలిచారా, మీ పార్టీకి చెందిన ముఖ్యనాయకురాలైతే ఇంటికి పిలుచుకొని మీ మనువడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరసారె పెట్టి సాదరంగా సాగనంపండి. అంతేకాని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తామంటే తప్పకుండా నల్లబుగ్గలు ఎగరేసి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.

Advertisement
CJ Advs

కవిత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని విమర్శించడంతో.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్, కల్వకుంట్ల కవితపై ఫైర్ అయ్యారు.

ప‌దేళ్లు గుర్తురాని ఫూలే ఇప్పుడు గుర్తు రావ‌డం చాలా సంతోషం..

అన్న‌, బావ‌, అన్న‌య్య‌లు తెలంగాణాని దోచుకున్నారు.

తెలంగాణ ఇచ్చింది.. కాంగ్రెస్‌.. ఆ పార్టీని విమ‌ర్శించొద్దు, అసలు విమర్శించే హక్కు కూడా మీకు లేదు.

సియం ప్ర‌జ‌ల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండ‌దు..

గేటు బ‌య‌టే ఆపేసి అవమానించి గ‌ద్ద‌ర్‌ ను ఆనాడే చంపేశారు.

ఆయ‌న పేరుమీద కాంగ్రెస్ ఇప్పుడు అవార్డులు ఇస్తుంది.

జానారెడ్డి త‌ప్పుకుని కొడుకుకు అవ‌కాశం ఇచ్చారు.

మంత్రుల‌ను డ‌మ్మీల‌ను చేసింది మీరు కాదా ?

మీరు లిక్క‌ర్ స్కాంలో అక్ర‌మ సంపాద‌న చేయ‌లేదా ?

మీ వ‌ల్ల మీ త‌ల్లి తండ్రి ఎంత బాధ ప‌డి ఉంటారు ?

లిక్క‌ర్ స్కాంతో రాష్ట్రన్ని అప‌ఖ్యాతి పాలు చేసింది మీరు కాదా ?

బీసీల కోసం మీ త్యాగం అవస‌రం లేదు.

ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు మీరు.

రాధాకృష్ణ ఇంటికి రేవంత్ రెడ్డి వెళితే త‌ప్పేంటి ?

మీ పార్టీ ఆఫీసుకు స్థ‌లం ఇస్తే కొండా ల‌క్ష్మణ్ బాపూజీని మీరు ప‌ట్టించుకున్నారా ?

సియం కావాల‌ని మీరు.. కేటీఆర్ ఆశ‌ప‌డ్డారు..

అదిసాధ్యం కాలేద‌ని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ముందు లిక్క‌ర్ స్కాం నుంచి బ‌య‌ట‌ప‌డండి..

రెస్ట్ తీసుకోండి.. ఏం త‌ప్పు చేశారో తెలుసుకోండి..

ప్రెస్ మీట్లు బంద్ చేయండి.. జనం మిమ్మల్ని అస‌హ్యించుకుంటున్నారు.. అటూ కవితపై బండ్ల గణేష్ నిప్పులు చెరిగారు. 

Bandla fire on the Kalvakuntla Kavitha:

MLC Kavitha Fires On CM Revanth Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs