ఇప్పుడు ప్రేక్షకులు తెలివిమీరిపోయారు, కంటెంట్ ఉన్న సినిమాలని ఆదరిస్తున్నారు. గతంలో ఓటిటీ లు లేనప్పుడు వీకెండ్ ని ఎంజాయ్ చెయ్యడానికి సరదాగా ఏదో ఒక సినిమా అని థియేటర్స్ కి వెళ్లేవారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇలా అందరూ థియేటర్ దారి పట్టేవారు. ఓ సినిమా తర్వాత లంచ్, లేదంటే డిన్నర్ అంటూ ప్లాన్ చేసుకునేవారు, కానీ ఓటిటీ వచ్చాక థియేటర్స్ కి వెళ్లే జనాలు తగ్గారు. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అయితే తప్ప థియేటర్స్ ఒంక చూడడం లేదు, అందులోను చిన్న సినిమాలని అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే చిన్న సినిమాలు స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తున్నాయి.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు థియేటర్స్ లో విడుదలైంది. సో సో ప్రమోషన్స్, అసలా సినిమా చాలా మందికి రీచ్ అవ్వలేదు. అందులో ఈ వారం హెవీ కాంపిటీషన్. ఈ వారం జాతరలో తన సినిమాని దించాడు, కానీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. దానితో కన్నీరు మున్నీరు అవుతూ ప్రేక్షకులని నా సినిమా చూడమని వేడుకుంటున్నాడు. నన్ను బిగ్ బాస్ లో సపోర్ట్ చేసారు, నా సినిమా చూడ్డానికి ఇప్పుడు ప్రేక్షకులు ఎందుకు రావడం లేదు అంటూ భోరున ఏడ్చేశాడు.
అది చూసిన నెటిజెన్స్, ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు, సినిమాకి హిట్ టాక్ పడితే తప్ప థియేటర్స్ కి కదలరు, కన్నీళ్లు పెడితే కరుగుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.