సూపర్ స్టార్ రజినీకాంత్ వరస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయనకి నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మళ్ళీ ఆయన రేంజ్ పెరిగేలా చేసాడు. కథలో కొత్తదనం, మేకింగ్ లో స్పెషల్ లేకపోయినా అనిరుద్ BGM, సూపర్ స్టార్ స్టయిల్ ఇవన్నీ జైలర్ ని సక్సెస్ తీరానికి చేర్చాయి. ప్యాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన జైలర్ మూవీ విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో కళకళలాడింది. ఆ చిత్రం తర్వాత రజిని నుంచి వస్తున్న చిత్రం లాల్ సలామ్. ఆయన కుమార్తె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు.
అయితే లాల్ సలామ్ ని తమిళంలో ప్రమోట్ చేస్తున్న మేకర్స్ మిగతా భాషల్లో పట్టించుకోవడం లేదు, ఫిబ్రవరి 9 న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో డబ్ అయ్యి అదే రోజు విడుదలవుతున్న మిగతా భాషల్లో ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంటున్నారు మేకర్స్. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మార్కెట్ మళ్ళీ రేజ్ అయ్యింది. తెలుగులో మరోసారి సూపర్ స్టార్ సినిమాకి క్రేజ్ పెరిగింది.
మరో వారంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం విషయంలో తెలుగు నిర్మాతలు లైట్ గా ఉన్నారు. కారణం ఈగల్ కి సోలో డేట్ ఇస్తామని చెప్పడం, డబ్బింగ్ మూవీగా వస్తున్న లాల్ సలామ్ ని కొద్ది థియేటర్స్ తోనే లైకా వారు సరిపెట్టుకుంటామని చెప్పడంతో ప్రమోషన్స్ ని కూడా లైట్ తీసుకున్నారు. మరి రజినీకాంత్ గెస్ట్ రోల్ అయినా.. ఆయన కున్న క్రేజ్ సినిమాకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనడంలో సందేహం లేదు.