Advertisement
Google Ads BL

ఫ్రస్టేట్ అవుతున్న బిగ్ బాస్ సోహెల్


బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ కన్నా ఎక్కువగా పాపులర్ అయ్యి చికెన్ చికెన్ - మటన్ మటన్ అంటూ మెగాస్టార్ వైఫ్ సురేఖ గారి దగ్గర నుంచే బిర్యాని తెప్పించుకున్న నటుడు సోహెల్.. బిగ్ బాస్ ద్వారా వచ్చిన భీభత్సమైన క్రేజ్ తో వెండితెర మీద హీరో అవతారమెత్తాడు. ఇప్పటికే మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. తాజాగా నిన్న ఫిబ్రవరి 2 న బూట్ కట్ బాలరాజు అంటూ మరోసారి ప్రేక్షకులని పలకరించాడు. 

Advertisement
CJ Advs

ఫిబ్రవరి మొదటివారంలో హెవీ కాంపిటీషన్ మధ్యన సోహెల్ తన సినిమాని విడుదల చేసాడు. నిన్న శుక్రవారం దాదాపుగా ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ధీర, హ్యాపీ ఎండింగ్, గేమ్ ఆన్, కిస్మత్ సినిమాల మధ్యలో సోహెల్ బూట్ కట్ బాలరాజు విడుదలైంది. అయితే ఈ చిత్రం విడుదలైన థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించకపోవడంతో నటుడు సోహెల్ ఫ్రస్టేట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వదిలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తనని బిగ్ బాస్ లో తెగ ఎంకరేజ్ చేసారు. సోహెల్, సోహెల్ అని అరిచారు. కానీ ఇప్పుడు నా సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఎందుకు రావడం లేదు, అందరిలా ముద్దు పెట్టిన సీన్స్, లవ్ స్టోరీస్ తీస్తేనే చూస్తారా.. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా సినిమా చేస్తే చూడరా.. ప్రమోషన్స్ అంటారా.. నేను నా తాహతుకు తగట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశా.. అదొక్కటే చేయగలిగాను, ప్రతిసారి ఫ్రెండ్స్ తోనే కాదు, అమ్మ నాన్నలతో, నాన్నమ్మలతో సినిమాలు చూడండి, కంటెంట్ ఉన్న సినిమాలు ఆదరిస్తారు, నా సినిమా చూడడానికి బాగానే ఉంది కదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో కమెడియన్ ముక్కు అవినాష్ సోహెల్ ని ఓదారుస్తూ ఈ వీకెండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూస్తారు నువ్వు ఫీలవ్వకు అంటూ ఓదార్చాడు.

Bigg Boss Sohel is getting frustrated:

Sohel Emotional Crying Words About His Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs