Advertisement
Google Ads BL

దేవర డేట్ ని ఖాయం చేసిన దేవరకొండ


ఏప్రిల్ 5 న ఎన్టీఆర్ దేవర ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే అనౌన్స్ చేసారు. అదే టార్గెట్ గా దేవర షూటింగ్ జరుగుతూ వస్తుంది. కానీ రీసెంట్ గా విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయమవడంతో.. దేవర విడుదల తేదీపై రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు రావడం ఆ తేదీపై కుర్ర హీరోలు ఫోకస్ చెయ్యడం అన్ని ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి. ఇప్పుడు అదే దేవర తేదిని విజయ్ ఫ్యామిలీ స్టార్ కోసం ఫిక్స్ చేసాడు.

Advertisement
CJ Advs

ఏప్రిల్ 5వ తేదీన ఫ్యామిలీ స్టార్ ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నారు. లుంగీ కట్టుకుని గన్నీ బ్యాగ్, ఆధార్ కార్డ్ తో విజయ్ నడిచి వస్తున్న పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటోంది. 

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.  ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

The Family Star releasing worldwide on April :

Vijay Deverakonda The Family Star releasing worldwide on April 5th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs