Advertisement
Google Ads BL

షాకింగ్: పూనమ్ పాండే మృతి


బాలీవుడ్ మోడల్ కమ్ నటి పూనమ్ పాండే మృతి వార్త అందరిని షాక్ కి గురి చేసింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వార్తలతో సోషల్ మీడియాలో కనిపించే పూనమ్ పాండే ఇంత చిన్న వయసులో కన్ను ముయ్యడం బాలీవుడ్ ప్రేక్షకులని విషాదంలోకి నెట్టేసింది. పూనమ్ పాండే నిన్న గురువారం రాత్రి మృతి చెందినట్టుగా ఆమె పీఆర్ టీమ్ సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ తో ఆమె మరణ వార్త ఒక్కసారిగా స్ప్రెడ్ అయ్యింది. పూనమ్ పాండే వయసు 32 ఏళ్ళు.

Advertisement
CJ Advs

పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ తో చికిత్స తీసుకుంటూ గత రాత్రి మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె పీఆర్ టీమ్ ఇన్స్టా వేదికగా.. ఈరోజు మాకెంతో కఠినమైన రోజు, మాకు ఎంతో ఇష్టమైన పూనమ్ పాండే ని కోల్పోయిన రోజు, ఆమె సర్వైకల్(గర్భాశయ) క్యాన్సర్ తో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమె తనకి తెలిసిన వారందరికీ ప్రేమని, ఆప్యాయతని పంచారు. ఇలాంటి దుఃఖ సమయంలో ఆమె మరణ వార్తని తెలియజెయ్యడానికి ఎంతో బాధపడుతున్నాము, ఆమె ప్రేమని ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటాము అంటూ ఆమె పీఆర్ టీమ్ తెలియజేసింది.

Poonam Pandey dies of cervical cancer:

Poonam Pandey dies at 32, PR team reveals reason
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs