గురూజీ పై ఎప్పటిప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేసే పూనమ్ కౌర్ రెండేళ్ల క్రితం అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా చెప్పిన విషయం తెలిసిందే. ఒకసారి వెన్ను నొప్పి రావడంతో కేరళ వెళ్లి వైద్యం చేయించుకున్న ఆమెకి అదే సమయంలో ఫైబ్రో మాయాల్జియా అనే వ్యాధి నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధికి కూడా పూనమ్ కౌర్ కేరళలో చికిత్స తీసుకుంటూనే ఉంది. గత రెండేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతుంది పూనమ్ కౌర్.
తాజాగా పూనమ్ కౌర్ తన హెల్త్ విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తాను నేచురోపతి వైద్యంలో ఫేమస్ అయిన మంతెన సత్యన్నారాయణని కలిసినట్టుగా.. ఆయన్ని కలిసిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆయన్ని కలవడం సంతోషంగా ఉంది. ఫైబ్రో మాయాల్జియా వ్యాధికి సంబంధించి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు అద్భుతం. ఒక మంచి మనిషితో కలిసి ఈ వ్యాధి గురించి అవగాహన కలిపించడం హ్యాపీగా ఉంది, తాను ఈ ఫైబ్రో మాయాల్జియా వ్యాధితో ఎంతో సఫర్ అయ్యాను.
చాలా నీరసంగా ఉంటుంది, ఈ వ్యాధి ఉన్నప్పుడు కనీసం దుస్తులు కూడా ధరించలేకపోయేదాన్ని, దానితో లూజ్ గా వున్న బట్టలు మాత్రం ధరించేదాన్ని, నిద్రలేమితో బాధపడేదాన్ని, అలసట మాత్రమే కాదు, శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గడమే కాదు, డిప్రెషన్,ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది అంటూ పూనమ్ కౌర్ తాను అనారోగ్యంతో ఎంతగా సఫర్ అయ్యిందో చెప్పుకొచ్చింది.