Advertisement
Google Ads BL

నాకు దేవరకొండే ఎక్కువ: రష్మిక


కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక వివాహం చేసుకోబోతున్నారు, రహస్యంగా డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ-రష్మిక ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటారనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.. విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ ఈ పెళ్లి రూమర్ ని ఖండించింది. కానీ రష్మిక మందన్న మాత్రం ఇప్పటివరకు ఈ పెళ్లి రూమర్ పై స్పందించలేదు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తనకి బాగా సపోర్ట్ చేస్తాడని, నాకు ఏది అవసరం, ఏది మంచో, ఏది చెడో వివరిస్తాడు, అలా చెప్పడం బాగుంటుంది, అందుకే విజయ్ సలహా తీసుకుంటా అని తెలిపింది.

Advertisement
CJ Advs

అంతే కాకుండా రష్మిక-విజయ్ దేవరకొండకి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని వచ్చిన వార్తలపై కూడా రష్మిక స్పందించింది. విజయ్‌ దేవరకొండతో తనకి ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదని, అదంతా రూమర్ క్లారిటీ ఇచ్చింది. ప్రతీ రెండేళ్లకోసారి తనకు విజయ్ కి పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు రెడీ అవుతున్నాయని ఫన్నీగా చెప్పుకొచ్చింది. మొదట్లో ఈ రూమర్స్ విన్న ప్రతిసారి కాస్త బాధ అనిపించిన ఇప్పుడు అలవాటైపోయి ఏమి పట్టించుకోవట్లేదు అంటూ రష్మిక విజయ్ తో పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. 

Rashmika says Vijay will support her:

Rashmika Mandanna Says Vijay Deverakonda Supported Me More Than Anyone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs